Monday, October 18, 2021

జీహెచ్ఎంసీలో చెరువుల అభివృద్ధి: కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్‌ంల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక డివిజన్‌ను పెట్టి కమిషనర్‌ను నియమిస్తామని మంత్రి తెలిపారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారిని అక్కడి నుంచి తరలించి డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌లో చెరువుల పరిస్థితిపై రెండు రోజుల్లో ఎమ్మెల్యేలందరితో చర్చిస్తామన్నారు.

న‌గ‌రంలోని చెరువుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వ‌ల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌ని చెప్పారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను అభివృద్ధి ప‌రిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం కోట్ల రూపాయాలు మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News