Tuesday, May 14, 2024

బ్యాట్ ప‌ట్టి సిక్స్ కొట్టిన‌ మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రిత్వ శాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటారు… ఉప ఎన్నిక‌లు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల హ‌డావుడి అంతా అయిపోయాయి. అయితే ఆయ‌న ఆర్థిక శాఖ‌ లెక్కలే కాదు.. వైద్యారోగ్య శాఖ కూడా మ‌న‌దే అన్న‌ట్లుగా కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. హ‌రీశ్ రావు ఇవాళ బ్యాట్ ప‌ట్టి ఫిట్ గా ఉండేందుకు క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకున్న‌ కొద్దిసేపు మెరుపులు మెరిసేలా చేశారు. అయితే హ‌రీశ్ రావు గతంలోనూ ఆటవిడుపుగా క్రికెట్ ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొడితే సిక్స్ కొట్టాలి… ఒమిక్రాన్ ను తెలంగాణ నుండి త‌రిమికొట్టాల‌నే విధంగా స‌ర‌దాగా బ్యాటింగ్ చేశారు.

అయితే సిద్దిపేట ప‌ట్ట‌ణంలోని క‌రీంన‌గ‌ర్ రోడ్డులో సూప‌ర్ ఓవ‌ర్ ఫుడ్ అండ్ స్పోర్ట్స్ – డ్రైవ్ ఇన్ హోట‌ల్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి స్టేడియంలో స‌ర‌దాగా మంత్రి బ్యాట్ ప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement