Thursday, September 21, 2023

TS: సీఎంకు కృతజ్ఞతలతో భారీ ర్యాలీ… ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

- Advertisement -
   

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందు ఈ ప్రదర్శన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement