Friday, May 17, 2024

WGL: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కటౌట్ చించివేత కలకలం…

జనగామ, సెప్టెంబర్ 15, ప్రభ న్యూస్ : జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కటౌట్ పెట్టగా గుర్తు తెలియని వ్యక్తులు కటౌట్ చించడంతో శుక్రవారం తీవ్ర కలకలం సృష్టించింది. ఇదంతా గత కొంతకాలంగా జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం వర్గాలుగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేయడం, జనగామ బీఆర్ఎస్ పార్టీలో కూడా వర్గాలుగా ఏర్పడి సమీక్షలు, సమావేశాలు పెట్టినది విధితమే.

ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించి కట్టడి చేసినట్టు సమాచారం. కానీ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా వెలసిన కటౌట్ చినగడం నిన్న నర్మెట మండలంలో జరిగింది. ఏది ఏమైనా జనగామ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా పనిచేస్తున్నట్లు అక్కడక్కడ బహిర్గతం కావడం కలకలం సృష్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement