Sunday, April 28, 2024

ఉపాధి హామీ అమలులో తెలంగాణ టాప్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాజెక్టు అధికారుల అసోసియేషన్ 2022 సంవత్సరం క్యాలెండర్, డైరీలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పని దినాలు కేటాయిస్తే ఇప్పటివరకు 13 కోట్ల 38 లక్షల పని దినాలు (97.31 శాతం) కల్పించామని చెప్పారు. మరో 2 కోట్ల పని దినాలను అనుమతి లభించిందని ఆయన తెలిపారు. అలాగే, ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు రూ. 2,374 కోట్ల రూపాయలు కూలీగా చెల్లించినట్లు వివరించారు. గ్రామాల్లో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు రూ. 1049 కోట్ల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం అధికారులు ఉద్యోగుల కృషి వల్ల ఉపాధి హామీ పథకం అమలులో ఎన్నో సత్ఫలితాలు సాధిస్తూన్నామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ఏ పీ ఓ లు మరింత కృషి చేసి పథకం అమలులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి లో ఎల్లవేళలా ఉంచాలని ఆయన కోరారు. ఏపీఓ ల ఉద్యోగ సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement