Thursday, April 25, 2024

ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోండి : ప్రతీక్ జైన్

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భారత దేశ పౌరుల మైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంతి ఎన్నికల ప్రాభవాన్నినిలబెడతామని, మతం, కులం, వర్గం, భాష ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర సందేశం వినిపించారు.

అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును కలిగి ఉండడం ప్రథమ కర్తవ్యమని, అదే విధంగా దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్బంగా ముగ్గురు సీనియర్ ఓటర్లను సన్మానించారు. అదేవిధంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన ఉమా మహేశ్వరి, సేహ్న, ఆదిత్య ఘోష్ లకు ఎపిక్ కార్డులను అందజేశారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. హరిప్రియ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి సూసిందర్ కుమార్, సిపిఓ ఓంప్రకాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement