Friday, April 26, 2024

గని ప్రమాదం దురదృష్టకరం: జెడ్పీ చైర్మన్ పుట్ట

అడ్రియాల ఏరియా పరిధిలోని ఏఎల్పీ గనిలో ప్రమాదం జ‌ర‌గ‌డం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా తిరిగిరావాలని జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆకాంక్షించారు. గని ప్రమాదం జరిగిన ఏఎల్పీ గనిని సందర్శించిన ఆయన ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గని ప్రమాదం జరిగిన సమయంలో ఎడుగురు అందులో చిక్కుకోగా ఎరుకల వీరయ్య అదే సమయంలో అక్కడ నుండి బయటపడ్డాడన్నారు.

తాము గని వద్దకు చేరిన సమయంలో ఎఫ్ బీఎల్ ఆపరేటర్ వెంకటేష్ ను రెస్క్యూ బృందం రక్షించి తీసుకురాగా, ఓర్మెన్ నరేష్ ను పైకి తీసుకు వస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇంకా ఆ ప్రమాదంలో చిక్కుకున్న ఏరియా రక్షణాధికారి జయరాజ్, అండర్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవిందర్, వీటీసీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ లు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. ప్రమాద బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement