Tuesday, May 7, 2024

ఉమెన్స్‌ డే కానుకగా మహిళా వర్శిటీ.. బడ్జెట్‌లో రూ.100 కోట్ల నిధులు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బడ్జెట్‌లో విద్యాభివృద్ధి సముచిత నిధులను కేటాయించినందుకు గానూ ఈమేరకు సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సోమవారం శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సీఎంని కలిసి మహిళా దినోత్సవ కానుకగా మహిళా విశ్వవిద్యాలయానికి నిధులను కేటాయించినట్లు భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం దిశగా మంగళవారం మన ఊరు-మన బడి పథకాన్ని వనపర్తిలో లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత స్థితికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మహిళాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం..

కోఠి ఉమెన్స్‌ కాలేజీని మహిళా వర్శిటీగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో రూ.100 కోట్లను కేటాయించినందుకు గానూ కోఠి మహిళా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఈమేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికరతకు కృషి చేస్తుందనడానికి మహిళా వర్శిటీ ఏర్పాటే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ విద్యనభ్యసించే మహిళలు… విద్యా, వ్యాపార, ప్రభుత్వ రంగ సేవల్లో రాణిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వర్శిటీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌లకు ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం….

మహిళా యూనివర్శిటీ ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించడంతో కోఠి ఉమెన్స్‌ కళాశాలలో సంబరాలు, హర్షద్వానాలు మిన్నంటాయి. మహిళా వర్శిటీ ఏర్పాటుకు నిధులను కేటాయించడంతో కళాశాల విద్యార్థినులు సంతోషంతో నృత్యాలు చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్‌ కట్‌చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement