Tuesday, April 30, 2024

AP – భారీగా నామినేషన్ లు – పరిశీలన నేడే

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామపత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.గురువారం (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు పూర్తయింది. ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది.

ఏపీ వ్యాప్తంగా లోక్‌సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇండిపెండెంట్లు, డమ్మి అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు, మూడేసి సెట్లు దాఖలు చేశారు. వచ్చిన నామినేషన్ల సెట్లను నేడు ఎన్నికల అధికారులు పరిశీలన చేయనున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నాయి

. స్క్రూట్నీలో ఒకే అయ్యాక డమ్మి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ నెల 29వ తేదీన నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మే 13వ తేదీన ఒకే విడతలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement