Wednesday, May 15, 2024

దక్షిణ కొరియాలో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి అధ్యయన బృందం..

సియోల్ – వేమానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి లో భాగంగా rదక్షిణ కొరియా వెళ్లిన తెలంగాణ బృందానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సింగపూర్‌, సీయోల్‌, ఒసో లో అధ్యయనం చేసేందుకు గురువారం వెళ్లగా శుక్రవారం దక్షిణ కొరియా చేరుకుంది. బృందంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తోపాటు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ప్రిన్సిపల్‌ సెకట్రరీ రజత్‌కుమార్‌, పర్యాటకశా ఖ ఎండీ లు ఉన్నారు.

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి లో భాగంగా rదక్షిణ కొరియా వెళ్లిన తెలంగాణ మంత్రులు మరియు అధికారులకు బృందానికి విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల ఇంచార్జి స్వాగతం పలికారు. సింగపూర్‌తోపా టు సౌత్‌ కొరియాలోని సియోల్‌, ఓసోలో పర్యటించనున్నన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు లో చేపడుతున్న బిగ్‌ ఓ ఫౌంటెయిన్‌ ఒసోలోనే ఉంది, అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ ఆధునిక టెక్నాలజీని తీసుకువచ్చేందుకు ప్రయత్నా లు చేసేందుకు ఈ బృందం స్టడీ టూర్ కు వెళ్ళింది.

ఒసో రివర్‌ ఫ్రంట్‌లోని ఎలిమెంట్లను కరీంనగర్‌ తేవాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి గంగుల. సింగపూర్‌లో అమెరికన్‌ టెక్నాలజీతో నిర్మించిన యూనివర్సల్‌ స్టూడియోని అధ్యయ నం చేస్తామన్నారు. గుజరాత్‌లోని సబర్మతీ రి వర్‌ ఫ్రంట్‌ కంటే అధునాత నంగా, మన రాష్ర్టానికే గర్వకారణంగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement