Tuesday, May 7, 2024

Metro Review – ఐదు సెక్టార్ లలో మెట్రో విస్తరణ – రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌ మెట్రో రైలుపై కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు సెక్టార్ లలో మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది సర్కార్‌. ఈ క్రమంలో మెట్రో రైలు విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మెట్రో రైలు పొడిగింపుపై సీఎం రేవంత్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై త్వరగా డీపీఆర్‌, ట్రాఫిక్‌ స్టడీస్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు(14 కి.మీ), రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(12 కి. మీ), ఎంజీబీఎస్‌ నుంచి ఎయిర్‌పోర్టు (23 కి.మీ), ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌( 8 కి.మీ) మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని స్పష్టం చేశారు.

పాతబస్తీలోని దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్‌నుమా వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని తెలిపారు. ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.

మెట్రో ఫేజ్-IIIలో భాగంగా జేబీఎస్‌ మెట్రో స్టేషన్ నుంచి షామీర్‌పేట వరకు విస్తరించాలని సీఎం తెలిపారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్‌(40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని తెలిపారు

మూసీ నది అభివృద్ధి పై సమీక్ష

- Advertisement -

మూసీ నది అభివృద్ధి పై నానక్ రామ్ గూడ హెచ్ డి ఎం ఏ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ,, జాయింట్ మెట్రోపాలిటన్ కమీషనర్ ఆమ్రపాలి ,, సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి , సంబంధిత అధికారులు హాజరయ్యారు.

సీఎం తో శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ భేటి

తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ సీఎం ను ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమరులు, ఉద్యమకారుల కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని రేవంత్ హామీ ఇచ్చారు

కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ నెల 7న జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని అర్చకులు ఆహ్వానించారు.

నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో భేటీ అయిన నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ, సభ్యులు వి. కె. సారస్వత్.

రేవంత్ తో సీపీఐ నేతలు భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రినీ మర్యాదపూర్వకంగా కలిసిన సీపీఐ నేతలు కూనంనేని సాంబశివ రావు ,, నారాయణ ,, చాడ వెంకట్ రెడ్డి తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement