Sunday, April 28, 2024

MDK : మెద‌క్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాహనం తనిఖీ…

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధ‌వారం బీఆర్ఎస్ మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి వాహ‌నాన్ని పోలీసులు త‌నిఖీ చేశారు.

- Advertisement -

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్తుండ‌గా తుర్క‌ప‌ల్లి స‌మీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వ‌ద్ద వెంక‌ట్రామిరెడ్డి వాహ‌నాన్ని ఆపి త‌నిఖీ చేశారు. పోలీసుల త‌నిఖీల‌కు పూర్తి స్థాయిలో వెంక‌ట్రామిరెడ్డి స‌హ‌క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement