Friday, May 3, 2024

పల్లెలు ప్రగతికి సోపానాలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : అభివృద్ధిలో శరవేగంగా విస్తరిస్తున్న పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, రామేశ్వరం బండ, చిట్కుల్ గ్రామాల పరిధిలో ఐదు కోట్ల 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఓవర్ హెడ్ ట్యాంకులు, సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులకు ఆదివారం స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ముత్తంగి ప్రధాన రహదారి నుండి చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగార్జున కాలనీ వరకు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నూతన కాలనీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెలా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఇంద్రేశం ఉపసర్పంచ్ శివ గౌడ్ గ్రామ ప్రజల కోసం అందించిన వైకుంఠ రథంను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement