Saturday, April 27, 2024

పది ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా మూడో స్థానం..

ప‌ది ఫ‌లితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు స‌త్తా చాటారు. నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లా ఈ ఏడు కూడా మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గత పదవ తరగతి ఫలితాల్లో వరసగా రెండు సార్లు, మూడవ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతలో గత సంవత్సరం కంటే ఈఏడు 0.54 శాతం అధికంగా సాధించారు. జిల్లాలో 21,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 20,780 మంది విద్యార్థులు పాస్ కాగా 97.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 10,713 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 10,367ఉత్తీర్ణత (96.77శాతం) సాధించారు. అదే విధంగా బాలికల విభాగంలో 10,645 విద్యార్థినీలు పరీక్ష రాయగా 10,413 విద్యార్థినీలు ఉత్తీర్ణత (97.82 శాతం) సాధించారు. పదవ తరగతి ఉత్తీర్ణతలో బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ శాతం ఉతీర్ణత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement