Sunday, May 5, 2024

వంద ఎక‌రాల్లో ఆయిల్ ఫామ్ తోట‌లు నాటాలి : మంత్రి హ‌రీశ్ రావు

వచ్చే వానాకాలం లోపు వంద ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు నాటాలని గ్రామస్తులను మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామంలో ఈరోజు ఉదయం అభయాంజనేయ స్వామి, శివ పంచాయతన నవగ్రహా, నాగదేవత ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి శక్తినిచ్చే దేవుడని, సీఎం కేసీఆర్, హరీశ్ రావుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శక్తినిచ్చి, అందరినీ సుభిక్షంగా కాపాడాలని ఆకాంక్షించారు.

అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర పల్లెలకు జలకళ వచ్చిందని తెలిపారు. నర్మెట్టలో 250 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చెప్పారు. మరొకటి మీ గూడెంలను కలిపేందుకు పదేళ్లు పట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. పది తరాలకు నిలిచిపోయే పని ప్రారంభం చేసుకుంటున్న దరిమిలా ఆంజనేయ స్వామిని దర్శించుకుని, దిగ్విజయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గ్రామంలో పెద్దమ్మ ఆలయాన్ని గతేడాది ప్రారంభించుకున్నామని, అభయాంజనేయ ఆలయాలను నిర్మించుకున్నట్లు సంబురం వ్యక్తం చేశారు. అలాగే దుర్గాదేవి ఆలయంకు కూడా సహకరిస్తానని పేర్కొంటూ.. గ్రామస్తులంతా ఇదే తరహాలో ఐక్యంగా కలిసి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement