Sunday, February 5, 2023

క్రీడ‌ల‌తోనే మాన‌సికోల్లాసం : ఎమ్మెల్యే జీఎంఆర్‌

ప‌టాన్ చెరు : క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎంఆర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. క్రీడ‌లు మాన‌సికోల్లాసాన్ని ఇస్తాయ‌న్నారు. క్రీడాకారుల‌కు ప్రోత్సాహం వందించేందుకు క్రీడ‌లు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం అన్నారు. ప్ర‌భుత్వం కూడా క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్ ముదిరాజ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement