Wednesday, April 24, 2024

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అప్ డేట్.. జ‌న‌వ‌రి 26న టీజ‌ర్..!

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. హరి హర వీరమల్లు టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న క‌ల్యాణ్ కి జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రిలు న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement