Thursday, May 2, 2024

TS | ఐక్యంగా ఉండి, రాజ్యాధికార హ‌క్కులు సాధిద్దాం: ముదిరాజ్ మ‌హాస‌భ

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​) :  ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హ‌క్కులు సాధించుకోవాల‌ని రాష్ట్ర ముదిరాజ్ మ‌హాస‌భ రాష్ట్ర కార్య‌వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది. ఇవ్వాల (గురువారం) హైదరాబాద్‌ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌ ఆధ్వర్యంలో సమావేశం స‌రిగింది. ఈ భేటీలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియ‌మించారు. ఈ మేర‌కు నియామక పత్రం అందజేశారు. దీంతో పాటు సిద్దీపేట జిల్లా ముదిరాజ్ మహాసభ  అధ్యక్షుడిగా ధర్మాముదిరాజ్ నియ‌మితులు అయ్యారు. సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో బండ ప్రకాష్ మాట్లాడుతూ.. ముదిరాజులు  రాజకీయంగా ఎదగాలని, దీనికోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ముదిరాజ్‌ లకు రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అభిప్రాయప‌డ్డారు.

ముదిరాజులు రాజకీయ హక్కులు  సాధించే వరకూ అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈ  సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ నీలం మధు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్,  ముదిరాజ్ యువత రాష్ట్ర ప్రదానకార్యదర్శి,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ సభ్యుడు అల్లుడు జగన్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement