Saturday, May 18, 2024

శాప… ప్రతిశాపాలు

ఉదంకుడు పైల మహర్షి శిష్యుడు. గొప్ప తపశ్శాలి. అణిమా ద్యష్ట సిద్ధులు సాధించాడు. అపరిమిత నిష్ఠతో గురువును సేవించాడు. విద్యాభ్యాసం పూర్తి అయ్యింది. గురువు గురు దక్షిణ వద్దన్నాడు. అయితే గురుపత్ని మాత్రం పౌష్యమహాదేవి ధరిం చే కుండలాల్ని తెచ్చి ఇమ్మంది. సంతోషంతో పౌష్య నగరానికి బయల్దే రాడు. మార్గమధ్యలో వృషభాన్ని అధిరోహంచిన దివ్యపురుషుడు కన్పించాడు. ఆయన చెప్పినట్లు ఆ వృషభం గోెమయాన్ని తిన్నాడు. పౌష్యదేశానికి వెళ్ళి రాజును దర్శించి ఇలా అర్థించాడు.
”ఏనుగుర్వర్ధమర్ధినై మానవేశ
కడగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క
దండితారాతి నీ దేవి కుండలము
లిమ్ము నాపూన్కి యిది సఫలమ్ముగాఁగ”
– ఆం. మ.భా., ఆ.ప., ప్ర. ఆ., 95వ
రాజు ఎంతగానో సంతోషించాడు. అది పాత్రదానం కావున, నా భార్య ఇప్పుడు వాటిని ధరించే సమయం. నీ వెళ్లి నామాటగా వాటిని పుచ్చుకొమ్మన్నాడు. వెంటనే ఉదంకుడు అంత:పురంలోనికి వెళ్లాడు. ఎక్కడా ఆమె కన్పించలేదు. తిరిగి వచ్చి ఆమె ఎక్కడా కన్పింపలేదు. నీవే తెప్పించి ఇమ్మన్నాడు. అపుడు రాజు ”నీవు త్రిభువన పావనుడ వు. నిన్ను అశుచివని ఎలా అనగలను? అయితే ఆమె ఆశుచులకు కన్పించదు” అని ఎంతో వినయంగా పలికాడు. అపుడు ఉదంకునికి తాను చేసిన తప్పిదం గుర్తుకు వచ్చింది. అడవిలో దివ్యపురుషుడు ఇచ్చిన గోమయ భక్షణం చేసిన తరువాత ఆచమనం చేయలేదని, పరిశుద్ధిని పొందలేదని, అదే అశుచి కారణ మని తలచి ”పూర్వాభిము ఖుడై శుద్ధోదకంబు లంబ్రక్షాళిత పాణిపా దవదనుండై ఆచమించా డు” రాజు అనుమతింపగా అంత:పురానికి వెళ్లాడు. రాణి కన్పించిం ది. ఆమె నమస్కరించి కుండలాలు సమర్పించింది.
”తక్షకుఁడీ కుండలముల
పేక్షించుచునుండు వాఁడభేద్యుఁదు మాయా
దక్షుండు వానివలన సు
రక్షితముగఁజేసి చనుము రవినిభతేజా”
– ఆం. మ. ఖా., ఆ.ప.,ప్ర.ఆ., 99ప.
తక్షకుడు అపహరింప ప్రయత్నిస్తున్నాడు. సురక్షితంగా వెళ్లమ న్నది. అలాగేనని సెలవు తీసుకున్నాడు. రాజును చేరాడు. నీవు మా అతి థ్యం స్వీకరించి వెళ్లమన్నాడు. ఉదంకుడు అంగీకరించాడు. అన్నం తింటూండగా అందులో కేశం కన్పించింది. దాంతో బాధ కలిగింది. కోపం కట్టలు త్రెంచుకున్నది. వెంటనే ”అపరీక్షితంబైన యశుద్ధాన్నం బు పెట్టినాఁడవు అంధుండవగుమని” శపించాడు. వెంటనే పౌష్య మహారాజు ”అల్పదోషంబున నాకు శాపంబిచ్చినవాఁడవు నీవన పత్యుండవ గుమని” ప్రతి శాపం ఇచ్చాడు.
ఇద్దరూ ఒకరిని మరొకరు శపించుకున్నారు. వెంటనే ఉదంకుడు గజగజలాడి నేను అనపత్యుడను కాజాలను శాపాన్ని ఉపసంహరిం చమన్నాడు. గురుకులకు ఇష్టుడై అధ్యయనం పూర్తిచేశాడు. బ్రహ్మ చర్యానికి స్వస్తి చెప్పి గృహస్థు కాబోతున్నాడు. గార్హస్థ్యఫలం సంతా నమే. అది లేనిది వ్యర్థమే. అనపత్యత వల్ల పిత్రాణం తీరదు, తర్పణా దిక పితృకార్యాలకు విఘ్నం ఏర్పడుతుంది. అందువల్ల అంతగా విల విలలాడి శాపాన్ని ఉపసంహరించమన్నాడు. అపుడు రాజు-
”నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రుల యందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁడోపు నో
పండతిశాంతుఁడయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపగన్‌”
– ఆం.మ.భా., ఆ.మ.,ప్ర. ఆ.ప., 101ప.
నీవు విప్రుడవు. నీ మనసు వజ్రాయుధం.మన సు నవ్యనవనీతం. నేను రాజును. నా మాట నవ్య నవనీతం, మనసు వజ్ర సదృశం. దాం తో నా మనసు కరగదు. నీ మనసు కరుగుతుంది. నీవే శాపాన్ని శమిం పజేయగలవు. నేను ఏమాత్రం చేయలేనని రాజబ్రా హ్మణ స్వభావాలు వివరించాడు. దాంతో ఉదంకుడే తన శాపా న్ని ఉపశమింపజేశాడు.
తదుపరి తక్షకుడు కుండలాల్ని అపహరించడం, ఉదంకుడు పాతాళానికి వెళ్లి నాగప్రముఖుల్ని స్తుతించడం, ఉన్నతాశ్వాన్ని ఎక్కి న దివ్యపురుషుడిని స్తుతించడం, అతడి నిర్దేశానుసారంగా ఆ గుఱ్ఱం చెవిలో ఊదితే అగ్నిజ్వాలలు వ్యాపించడం, తక్షకుడు భయపడి కుండలాలు తెచ్చివ్వడం జరిగింది. అదే గుఱ్ఱాన్ని ఎక్కి వచ్చి సకాలం లో గురుపత్నికి కుండలాలు సమర్పించాడు.
వంకజభవ సన్నిభుడైన మహాతపస్వి అల్పదోషానికి కుపితుడై శపించడం ఎంతో తప్పు. దాంతో ప్రతి శాపం పొందాడు. రాజు చెప్పి న యథార్థ వచనాన్ని కాదనలేక రాజుకు దృష్టిని తిరిగి అనుగ్రహంచా డు. తాను మాత్రం సంతానహనుడుగానే మిగిలాడు. అవధి తప్పిన కోపం, వేగిరం కొంప ముంచాయి. అపకారి తక్షకుడి మీద కోపం పెరి గిందే గాని తరగలేదు. జనమేజయుడి దగ్గరకు వెళ్లాడు. మహారాజా! నేను గురు కార్యనిర్వహణ ధురంధరుడనై ఉండగా అతి కుటిల స్వభా వుడు, వివేక శూన్యుడు అయిన తక్షకుడు నాకు అపకారం చేశాడు. నీ తండ్రిని భరత కుల వర్ధనుడిని, దాన నిరతుడిని, ఆది రాజ నిభుడిని కరిచి చంపాడు. ఎవడో శృంగి అనే విప్రుడి మాటకై మీ తండ్రిని చం పాడు. నీవు అనేక విప్రుల అనుమతితో, వారి పర్యవేక్షణలో సర్పయా గం చేసి పాపజాతిని ద#హంచు. కులంలో ఒకడు చెడ్డవాడున్నా కుల మంతా చెడక తప్పదు. తక్షకుడి కారణంగా సర్పజాతి చావక తప్పదు. జనమేజయుడు సర్పయాగం నిర్వహంచాడు. అల్పసర్పాలు వేలకు వేలు మరణించాయి. ఆస్తీకుడి వలన సర్ప యాగం మధ్యలోనే ఆగిం ది. అస్తీకుడు వాసుకి చెల్లెలు జరత్కారువు కుమారుడు. అతడివల్ల సర్పయాగం ఆగుతుందని బ్రహ్మదేవుడి వాక్కు, తక్షకుడు బ్రతికాడు. ఇంతచేసి ఉదంకుడు తక్షకుడిని వధింపలేక పోయాడు. అనపత్యుడు గానే ఆశ్రమంలో తపస్సుచేస్తూ ఉండిపోయాడు.
శ్రీకృష్ణుడు శాంతను శాసనిక పర్వాలు పరిసమాప్తమై ధర్మరాజు దు:ఖరహతుడై రాజ్యం చేస్తూండగా హస్తిన నుండి ద్వారకకు వెళు తూ మార్గం ప్రక్కనే గల ఉదంకుడి ఆశ్రమానికి వెళ్లాడు. అప్పుడు ఉదంకుడు శ్రీకృష్ణుడు కౌరవపాండవులు సఖ్యం కోసం సరిగా ప్రయ త్నించలేదని కోపించి శపించబోయి, మందలింపబడి శాంతించాడు. విశ్వరూప దర్శనం కలిగించమని అర్థించి చూసాడు. వర్షాన్ని వరం గా కూడా పొందారు. మాతంగ వేషంలో వచ్చిన ఇంద్రుడుని గుర్తించ గ అమృతపాణాన్ని పొందలేకపోయాడు. ఏదిఏమైనా ఉదంకుడు దుడుకు స్వభావి. శాపజలం ఎప్పుడూ అరచేతిలో ఉంటుంది. అం దుకే ఆయన అంతటి దు:ఖ జీవితాన్ని అనుభవించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement