Sunday, April 28, 2024

MDK: ఎన్నికల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన కలెక్టర్

ఉమ్మడి మెదక్ బ్యూరో : శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంకు సంబంధించి గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో ఏ బ్లాక్ నందు ఎన్నికల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. స్ట్రాంగ్ రూంలో గట్టి బందోబస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కిటికీలను పూర్తిగా ఇటుకలతో ముసివేయ్యాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ముందు చుట్టూ సీసీ కెమెరాలు మార్చాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే విద్యుత్ మాపక గది ఉన్నందున ఫైరింగ్ కు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే వెనువెంటనే పరిష్కరించడానికి ఫైర్ వాహనాన్ని అందుబాటులో డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు 24/7 ఉంచాలని జిల్లా అసిస్టెంట్ ఫైరింగ్ ఆఫీసర్ సురేష్ కి తెలిపారు.

తపాలా కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గం నూతన ఓటర్లకు సంబంధించి ఓటర్ ఐడీ కార్డులు వచ్చాయా అని తపాలా కార్యాలయ సిబ్బందిని అడిగారు. కార్డులు వచ్చిన వెంటనే గ్రామాల్లోకి వెళ్లి వివిధ శాఖలకు డిస్ట్రిబ్యూషన్ చేసి పంపిణీ చేయాలని సూచించారు. ఆర్ అండ్ బీ గదిని స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ సిబ్బంది 24/7 డ్యూటీ చేసేందుకు అందజేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు తెలిపారు. అలాగే ఎలక్షన్ మెటీరియల్ రూమ్, ఈవీఎం కమిషన్ హాల్, ఈఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ లో అకౌంటింగ్ టీం, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, వీడియో వ్యువింగ్ టీం సెల్ లను పరిశీలించారు. ప్రతి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

అనంతరం గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేయబడిన పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు. ప్రహరీగోడ లేనందున చుట్టూ బారికేడింగ్ పెట్టాలన్నారు. పోలింగ్ బూత్ ల వారిగా నంబర్లు వేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్డీవో & గజ్వేల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బన్సీలాల్, ఏసీపీ రమేష్, తహసీల్దార్ బాలరాజు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement