Sunday, April 28, 2024

రైతు బిడ్డలతో ఆడుకుంటున్న‌ సీఎం కేసీఆర్ : జితేందర్ రెడ్డి

రైతు లేకపోతే ప్రపంచమే లేదు.. రైతు బిడ్డలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మెదక్ లో బీజేపీ రైతు అవగాహన సదస్సు నిర్వహించింది. సదస్సుకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, బాబు మోహన్, వాసురెడ్డి, విజయ పాల్ రెడ్డి, రాష్ట్ర నేతలు, జిల్లా ఇంచార్జీలు, ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, రైతులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ కు నేను, నా కుటుంబం అనే అహం పెరిగిందన్నారు. రైతు బాధ్యత వడ్లు పండించడం.. కొనడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. నేను వడ్లు కొనను అని సీఎం కేసీఆర్ అంటున్నాడన్నారు. వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇస్తా అని రాసిచ్చి వచ్చాడు సీఎం కేసీఆర్ అని, ఏ రాష్ట్రం ఎంత బియ్యం ఇస్తారో అగ్రిమెంట్ చేశారన్నారు. గత వానాకాలంలో పండించిన దాన్యంతో ఎఫ్సిఐకి ఎన్ని బియ్యం ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందన్నారు. హుజురాబాద్ లోనే రైతులు, మహిళలపై కక్ష కట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… జితేందర్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ బీజేపీ విజయం పక్కా అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ జితేందర్ రెడ్డి ఉండాల్సిందేన‌న్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందన్నారు. మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ… ప్రతి గింజ కొంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని.. నేడు విస్మరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అబద్ధాల కోరు సీఎం కేసీఆర్ మాటలు వినొద్దని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement