Sunday, May 19, 2024

దుబాయ్‌లో బూరుగుపల్లి వాసి మృతి

హవేళిఘణపూర్‌ : కుటుంబ భారం తోటి పిల్లలను భార్య వదిలి అందరిలాగే బతుకుదెరువు కోసం దుబాయ్‌ దేశానికి వలస వెళ్లి పనులు చేస్తుండగా ప్రమాదంలో మరణించిన సంఘటన హఠాత్తుగా కుటుంబ సభ్యులకు తెలియగానే సొమ్మసిల్లి పడిపోయిన భార్య పిల్లలు సంఘటన హవేళిఘణపూర్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆరు సంవత్సరాల క్రితం నుండి బైరాన్‌, దుబాయ్‌ దేశాలకు వలస వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను పై చదువులు చదివిస్తూ కుటుంబ యజమాని మరణవార్త వినగానే ఆ కుటుంబం చలించిపోయింది. గ్రామానికి చెందిన జంగం శేఖర్‌ వయస్సు 36 సంత్సరాలు బైరాన్‌ ఒకసారి దుబాయ్‌ రెండోసారి వెళ్లి ప్రమాదంలో మరణించినట్లు వారి స్నేహితులు కుటుంబీకులకు తెలిపారు. మరణవార్త తెలుసుకున్న భార్య శోభ పిల్లలు భరత్‌ అమ్మలు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి హఠాన్మరణం చెందడం పట్ల కుటుంబం అనాథలు అయినామని బోరున విలపించారు. అపన్నహసం కోసం ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. భర్త శవాన్ని చివరి చూపు కోసం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకొని మరణించిన మృతదేహాన్ని తొందరగా స్వగ్రామానికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

హవేళిఘణపూర్‌, జూన్‌ 4 (ప్రభ న్యూస్‌) : కుటుంబ భారం తోటి పిల్లలను భార్య వదిలి అందరిలాగే బతుకుదెరువు కోసం దుబాయ్‌ దేశానికి వలస వెళ్లి పనులు చేస్తుండగా ప్రమాదంలో మరణించిన సంఘటన హఠాత్తుగా కుటుంబ సభ్యులకు తెలియగానే సొమ్మసిల్లి పడిపోయిన భార్య పిల్లలు సంఘటన హవేళిఘణపూర్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆరు సంవత్సరాల క్రితం నుండి బైరాన్‌, దుబాయ్‌ దేశాలకు వలస వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను పై చదువులు చదివిస్తూ కుటుంబ యజమాని మరణవార్త వినగానే ఆ కుటుంబం చలించిపోయింది. గ్రామానికి చెందిన జంగం శేఖర్‌ వయస్సు 36 సంత్సరాలు బైరాన్‌ ఒకసారి దుబాయ్‌ రెండోసారి వెళ్లి ప్రమాదంలో మరణించినట్లు వారి స్నేహితులు కుటుంబీకులకు తెలిపారు. మరణవార్త తెలుసుకున్న భార్య శోభ పిల్లలు భరత్‌ అమ్మలు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి హఠాన్మరణం చెందడం పట్ల కుటుంబం అనాథలు అయినామని బోరున విలపించారు. అపన్నహసం కోసం ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు. భర్త శవాన్ని చివరి చూపు కోసం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకొని మరణించిన మృతదేహాన్ని తొందరగా స్వగ్రామానికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement