Tuesday, May 7, 2024

బీడీ కార్మికుల ఆందోళన..

రామాయంపేట : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బహుజన బీడీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి తహశీల్దార్‌ శేఖర్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిగరేట్‌ పరిశ్రమలకు తొత్తులుగా మారి బీడీ పరిశ్రమ నుంచి వస్తున్నారని దశాబ్దాల కాలం నుంచి బీడీ పరిశ్రమపై ఆధారపడి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని వారు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలోఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే కేంద్రం, రాష్ట్రంలో బీడీ కార్మికులు భారీ ఆందోళనకు దిగడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు బీడీ కార్మికుల కొత్త చట్టానికి కుట్రపన్నుతుందని ఆయన ఈ చట్టం అమలు అయితే కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీడీ కార్మికుల ఆధ్వర్యంలో వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు, బీడీ కార్మికులు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్న

Advertisement

తాజా వార్తలు

Advertisement