Sunday, May 5, 2024

క్రీడలకు కేంద్రంగా మైత్రి మైదానం.. ఎమ్మెల్యే జీఎఆర్‌

ప‌టాన్ చెరు : ప‌టాన్ చెరు ట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న చంద్రకాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ 5A సైడ్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. వివిధ జిల్లాల నుండి 10 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీలో చంద్రకాంతయ్య అకాడమీ జట్టు ఘన విజయం సాధించింది. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని 7 కోట్ల 25 లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించడం తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు, ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి , రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇక నుండి మైత్రి మైదానంలో సంవత్సరం పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ప్రథమ విజేతకు 15 వేల రూపాయలు, రన్నరప్ కు 10 వేల రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ చెట్టుకు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడంతోపాటు ట్రోఫీలను బహూకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement