Tuesday, April 30, 2024

శరీరానికి దివ్యాఔషదం పుచ్చకాయ

ఝారాసంఘం : పుచ్చకాయ ఇది అందరికీ ఇష్టమే.. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా చాలా మందికి తెలిసిందే. ఇది మనశరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్థిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎండతీవ్రత పెరిగింది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. అధిక నీటి శాతాన్ని కలిగి ఉండే శరీరానికి ఎంతో మేలు చేసే పుచ్చకాయలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పుచ్చకాయలు తింటే శరీరానికి చల్లదనంతో పాటు వివిధ రకాల పోషకాల నీరు అందుతుంది. దీంతో ఎండ వేడిమిని తట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎండా కాలంలో మన శరీరంలో వాటర్‌ లెవల్స్‌ తగ్గిపోతుంటాయి. డీహైడ్రేషన్‌ స్టేజ్‌లోకి వెళ్లిపోతుంటాం. అలాంటి సమయంలో వడదెబ్బ తగిలి కళ్లుతిరిగి పడిపోతుంటాం. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసమే శరీరంలో వాటర్‌స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వ్యాపారులు పుచ్చకాయలను భారీగా అమ్మకాలకు సిద్ద ం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి పుచ్చకాయలను నిలువ చేశారు. ఎక్కడ చూసినా పుచ్చకాయలు పుష్కలంగా దర్శనమిస్తున్నాయి. పుచ్చకాయలు మార్కెట్‌లోకి విపరీతంగా వచ్చినప్పటికీ వీటి ధర మాత్రం తగ్గలేదు. పుచ్చకాయ సైజును బట్టి రూ. 30, 40 వరకు అమ్ముతున్నారు. పుచ్చకాయలలో మత్తుమిలాన్‌, వాటర్‌మిలాన్‌లతో పాటు బూడిద రంగు, పచ్చరంగు, తెలుపురంగు పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి.
పుచ్చకాయలలో మెండుగా పోషకాలు.
పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే యాంటి యాక్సీడెంట్లు, విటమిన్‌ బి, క్యాల్షియం, సోడియం, మెగ్నీషీయం, పోటాషీయం, క్లోరిన్‌, మిటన్‌ ఎ, బి, సి తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది. మధుమేహం ఉన్న వారికి మంచి ఔషదంగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలకు ఉంది. గర్భిణీ మహిళలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీవ్యాధులతో బాధపడే వారు తేనెలో కలిపి పుచ్చకాయ తింటే ఎంతో మంచిది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు మలబద్దకంతో బాధపడే వారికి పుచ్చకాయ ఎంతో మంచిది. మూత్ర విసర్జనలో చురుకు, మంట ఉన్న వారు, కామర్లతో బాధపడుతున్న వారికి పుచ్చకాయ రసం మజ్జిగలో కొంచెం ఉప్పు కలిపి తాగిస్తే ఎంతో మంచిది. ఇలా పుచ్చకాయలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement