Thursday, May 2, 2024

విషజ్వరాల నియంత్రణకు చర్యలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వర్షాకాలం సమీపిస్తుండడంతో దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగీ విష జ్వ‌రాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మారుమూలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టి సారించింది. తాజాగా… భూపాలపల్లి, ఆసీఫాబాద్‌, కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాలకు మలేరియా ముప్పు పొంచి ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది.

దీంతో ఆయా జిల్లాల్లో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా చర్యలతోపాటు దోమల తెరల పంపిణీని విస్తృతంగా చేపడుతున్నారు. ఈ వానా కాలంలో డెంగీ, మలేరియా నివారణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement