Thursday, April 25, 2024

రొమాంటిక్​ ఎంటర్‌టైనర్‌గా..

నటి మేఘ ఆకాష్‌ తల్లి బిందు ఆకాష్‌ సమర్పణలో ఓ చిత్రం రూపొందుతోంది. అభిమన్యు బద్ది దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో.. రాహుల్‌ విజయ్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటిస్తున్నారు. ఎ.సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మాతలు. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా ప్లానింగ్‌తో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరన‌ తొంభై శాతం పూర్తి చేశారు. ఇటీవలే గోవాలో ఓ షెడ్యూల్‌ ముగిసింది. గోవా నేపథ్యంలో జరిగే రొమాంటిక్‌ కథా చిత్రమిది. ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, అభయ్‌ బెతిగంటి, వైవా హర్ష, బిగ్‌ బాస్‌ సిరి తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement