Tuesday, May 7, 2024

ఆర్కే అంత్యక్రియులు పూర్తి

అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేత ఆర్కే అంత్యక్రియల పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి అయినట్టు ప్రకటించారు. తెలంగాణలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు.

ఇది కూడా చదవండి: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement