Tuesday, May 7, 2024

ఆర్కే అంతిమ‌ వీడ్కోలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు సీనియ‌ర్ నేత ఆర్కే అంత్యక్రియలు జ‌రిగాయి. ఈ మేర‌కు శ‌నివారం మావోయిస్టు పార్టీ నేత‌లు ఫొటోల‌ను రిలీజ్ చేశారు. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఈ అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. శుక్ర‌వారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్య‌క్ర‌మం పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజ‌రై నివాళుల‌ర్పించారు. మావోయిస్టు పార్టీ లాంఛనాలతో చివ‌రి వీడ్కోలు ప‌లుకి.. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement