Friday, September 22, 2023

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ఏపీ, తెలంగాణాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

- Advertisement -
   

ఇక, కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. 

ఇది కూడా చదవండి: వాహ‌న‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‘పెట్రో’ ధ‌ర‌లు

Advertisement

తాజా వార్తలు

Advertisement