Friday, May 3, 2024

లైన్‌మెన్‌ ఉద్యోగ అర్హత పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌.. ఐదుగురు విద్యుత్‌ ఉద్యోగులు సస్పెండ్‌..

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థలో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు సంబంధించి మాల్‌ప్రాక్టీస్‌ పాల్పడిన ఐదుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించి, క్రిమినల్‌ కేసులను నమోదు చేయడం జరిగిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగ అర్హత పరీక్షను ఈ నెల 17న నిర్వహించారు. అభ్యర్థుల నుంచి ఐదుగురు విద్యుత్‌ ఉద్యోగులు రూ. 5 లక్షల వరకు తీసుకుని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారనే విషయం బయటికి రావడంతో ప్రభుత్వం విచారణ జరిపించింది.

ఈ విచారణలో ఐదురుగురు ఉద్యోగుల ప్రమేయం ఉందని తేలడంతో వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెండైన వారిలో మలక్‌పేట ఏడీఈ మహ్మాద్‌ ఫిరోజ్‌ఖాన్‌, విద్యానగర్‌లో పని చేస్తున్న లైన్‌మెన్‌ సపావత్‌ శ్రీనివాస్‌, రైతిబౌలిలో ప్రయివేట్‌ మీటర్‌ రీడర్‌గా పని చేస్తున్న కేతావత్‌ దశరథ్‌, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ పరిధిలోని జగిత్యాలలో పని చేస్తున్న సబ్‌ ఇంజినీర్‌ షేక్‌ సాజన్‌, ట్రాన్స్‌కో పరిధిలోని మిర్యాలగూడలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ మంగళగిరి సైదులును సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు భవిష్యత్‌లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement