Tuesday, May 14, 2024

హైదరాబాద్‌లో ప్రారంభమైన మహదీయ మేకప్‌ స్టూడియో

మహదీయ తమ నూతన మేకప్‌ స్టూడియోను హైదరాబాద్‌ నగర నడిబొడ్డుగా నిలిచిన బంజారాహిల్స్‌ వద్ద వైవిధ్యమైన బ్రాండ్‌ గుర్తింపుతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినోద ప్రపంచంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. ఈ అతిథుల్లో తెలంగాణ రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక సేవల మంత్రి మొహమ్మద్‌ మహమూద్‌ అలీతో పాటుగా భారతీయ నటి, పూర్వ మోడల్‌ నమ్రత శిరోద్కర్‌, భారతీయ మోడల్‌, నటుడు అలీ రెజా ఖెరాద్మంద్‌, భారతీయ మోడల్‌, నటుడు, టెలివిజన్‌ పర్సనాలిటీ రోహిత్‌ ఖండేల్‌వాల్‌, ఎంటీవీ రోడీస్‌ పోటీదారు జబీ ఖాన్‌ పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మహదీయ దర్వేష్‌ మాట్లాడుతూ… చిన్నతనం నుంచి త‌నకు మేకప్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉండేదన్నారు. త‌న కల నిజమైన రోజు ఇదని అన్నారు. త‌న కల సాకారం కావడంలో త‌మ తండ్రి త‌నకు ఎంతగానో సహాయపడ్డారన్నారు. త‌న స్టూడియో తన గురించి తాను ఎంతగానో వెల్లడిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement