Sunday, May 5, 2024

Flash Flash‌: ప్రేమకు ఒప్పుకోలేదని యువతి దారుణ హత్య

తన ప్రేమను నిరాకరించిందని ఆగ్రహించిన ఉన్మాది యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలోని 8 ఇన్ క్లైన్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కేకే నగర్ కు చెందిన గొడుగు అంజలిని తారక నగర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చాట్ల రాజు గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వెంబడిస్తున్నాడు. తన ప్రేమను నిరాకరించడంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజలిని దారుణంగా గొంతు కోసి హతమార్చినట్లు సమాచారం. మంగళవారం మూడు గంటల నలభై నిమిషాల సమయంలో భోగి వెంకటేష్ జాబ్ కార్డు ఇచ్చేందుకు అంజలి ఇంటికి వెళ్లగా రక్తపుమడుగులో అంజలి కనిపించడంతో స్థానికులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, సిఐ శ్రీనివాస్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్టర్ డ్రైవర్ అయిన రాజు గత కొంత కాలంగా అంజలిని ప్రేమిస్తున్నానని వెంబడించడంతో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో హెచ్చరించినట్లు స్థానికులు తెలిపారు. అయిన కూడా వెంట పడుతున్న రాజు మంగళవారం అంజలిని కత్తితో మొదట గొంతుకోసిన అనంతరం కత్తితో బలంగా బాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెదపూడి సీపీ రవీందర్ మాట్లాడుతూ.. రాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement