Monday, April 29, 2024

విద్యాసంస్థలు ప్రారంభించండి..

మహబూబ్‌నగర్‌టౌన్‌ : కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నడపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ , ఏఐఎస్‌ఎఫ్‌ , పిడిఎస్‌యు, ఎన్‌ఎస్‌యుఐ , బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండవసారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థులపై ఏమాత్రం దృష్టి సారించలేదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ప్రతిరోజు శానిటైజర్‌ లతో తరగతి గదులు శుభ్రం చేసి ప్రభుత్వమే ఉచితంగా మాస్కులు విద్యార్థులకు పంపిణీ చేసి విద్యా సంస్థలు నడపాలని అన్నారు. విద్యాసంస్థల నిర్వహణపై క్లారిటీ ఇవ్వకపోతే ఈ ఉద్రిక్తత మరింత ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ , ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాము , పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ , ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ , బిసి సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేష్‌ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement