Friday, May 3, 2024

కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ లేఖలు

తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ లేఖలు రాసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖలు రాశారు. అంతేకాదు ఫోన్‌లో కూడా వారితో మాట్లాడారు. ఒకట్రెండు రోజులలో కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగర్‌ ఉప ఎన్నికల్లో ఎలాగైనా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని అటు కాంగ్రెస్‌, ఇటు కమ్యూనిస్టు పార్టీలు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 17న జరిగే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించగా.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

అటు నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్ళిన గిరిజనులపై జరిగిన దాడిలో 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని, వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement