Tuesday, March 26, 2024

ఇంగ్లండ్ ముందు 330 పరుగుల టార్గెట్

పూణె వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. దీంతో 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. వరుసగా మూడో వన్డేలోనూ టాస్ ఓడిపోయిన కోహ్లీ సేన ముందు బ్యాటింగ్ చేసింది. రోహిత్ (37), ధావన్ (67) సెంచరీ భాగస్వామ్యంతో ఒక దశలో భారత్ 400 పరుగులు చేస్తుందని అభిమానులు భావించారు. కానీ రోహిత్ ఔటయ్యాక భారత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లీ (7), కేఎల్ రాహుల్ (7) విఫలమయ్యారు. ఈ దశలో పంత్ (78), హార్డిక్ (64) ఆదుకోవడంతో భారత్ భారీ స్కోరు చేస్తుందని అనిపించింది. కానీ మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 329 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మార్క్ వుడ్ 3 వికెట్లు, రషీద్ రెండు వికెట్లు, మిగతా బౌలర్లందరూ తలో వికెట్ సాధించారు. ఇక భారత్ ఈ సిరీస్ గెలవాలంటే బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టులో అందరూ హిట్టర్లే ఉన్నారు. తొలి, రెండో వన్డేలో వారి బ్యాటింగ్ చూస్తే మూడో వన్డేలో భారత్ సాధించిన స్కోరు వారి ముందు చిన్నదే అని భావించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement