Wednesday, May 22, 2024

MBNR: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి

మక్తల్ : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నారాయణ పేట జిల్లా మక్తల్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మియాంక్ మిత్తాల్ కు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, గీత సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, లీగల్ సెల్ నాయకులు ఆడెం శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకులు గోలపల్లి నారాయణలతో కలిసి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో బొందపెట్టడం ఖాయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల ఆశీస్సులతో మక్తల్ లో గెలువబోతున్నామన్నారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతోందన్నారు. అంతకు ముందు పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం శ్రీ నల్లజానమ్మ దేవాలయంలో అదేవిధంగా నాభిశిల (బొడ్రాయి)కి పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement