Tuesday, April 30, 2024

వాసవిమాతకు ప్రత్యేక పూజలు

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవిమాతకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చకులు హరిశంకర్‌ శర్మ ప్రత్యేక అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలతో, పూలతో అలంకరణ చేశారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. తదుపరి పల్లకి సేవ కార్యక్రమాలను కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నయ్య , వెంకట్రాములు , లక్ష్మి నారాయణ , సుదర్శన్‌ , హరికాంత్‌ , విశ్వనాథం , కిషోర్‌ , రఘు, నరేష్‌ , మంజుల , పద్మ , అనిత , కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement