Saturday, May 18, 2024

నైట్ టైం కర్ఫ్యూకు సహకరించండి..

ఊట్కూరు : కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి 9 గంటల నుండి నిర్వహించిన కర్ఫ్యూకు మండల ప్రజలు అందరూ సహకరించాలని ఊట్కూర్ ఎస్ఐ రవి విజ్ఞప్తి చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ చేతన ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో.. భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి విధిగా మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలవద్ద యువకులు మాస్కులు లేకుండా తిరుగుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడికి వెళ్లి జరిమానాలు విధించడం తోపాటు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మాస్కులు ధరించి కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రజలు సహకారం అందించిన అప్పుడే వైరస్ నియంత్రించవచ్చని అన్నారు.మండలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికివెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ ను వాడాలని మాస్కులు పెట్టుకోని వారిపై ఈ చలాన్ ద్వారా కేసు నమోదు చేసి 1000 రూపాయల జరిమానా విధిస్తున్నామని .. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు తప్పకుండా ధరించాలని లేకపోతే 20 రూపాయల మాస్కు లేనందున వెయ్యి రూపాయల చలానా కట్టవలసి వస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement