Thursday, April 25, 2024

కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం..

ఊట్కూరు : కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఊట్కూరు మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో మూడు కట్టుకున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆడబిడ్డల పెళ్లి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకొని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో పెళ్లిళ్లకు అండగా ఉంటూ పేద వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత తెరాస దక్కిందన్నారు. పేద ప్రజల కోసం రైతు బంధు రైతు భీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కరోనా వైరస్ రెండోదశలో ప్రమాదకరంగా ఉందని కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఇంట్లో నుంచి బయటికి వస్తే ముఖానికి విధిగా మాస్కులు వేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ కు జాగ్రత్తలే శ్రీరామరక్ష అని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి మహమ్మారిని తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అశోక్ గౌడ్, తెరాస మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఊటుకూరు ఉపసర్పంచ్ ఈ బాదూరు రహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement