Friday, December 6, 2024

TS: అరుణ‌క్కా… నామీద ఎందుకు కోపం… రేవంత్ రెడ్డి

డీకే అరుణకు తన మీద కోపం, అసూయ ఎందుకో అర్థం కావడం లేదని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ కోడంగల్ నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే.. డీకే అరుణ అడ్డుపడుతోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి సెస్సేషనల్ కామెంట్ చేశారు. ఇన్నాళ్లు పాలమూరు నాయకులు ఎవరినో చేయిచాచి అడిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చామని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించే స్థాయిలో కొడంగల్ బిడ్డ ఉన్నాడంటూ రేవంత్ అన్నారు. కొండగల్ ప్రజల ఆశీర్వాదంతో ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు.

పాలమూరు ప్రాంతానికి ఎన్నో ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే.. డీకే అరుణ లాంటి వాళ్లు తనకు అడ్డు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగానంటూ డీకే అరుణ అంటున్నారని, మరి పాలమూరు ఎందుకు పూర్తి కాలేదో, ఎందుకు అభవృద్ధికి నోచుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆమెను అవమానించాల్సిన అవసరం తనకేంటని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

70 ఏళ్ల తరువాత పాలమూరుకు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందని, ఆ అవకాశాన్ని కొందరు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే.. ఆయన కనీసం కొడంగల్ వైపు తిరిగి చూడలేదని అన్నారు. కేసీఆర్ పదేళ్లే సీఎంగా ఉంటే నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డలంతా ఈ ఐదేళ్లు తనకు అండగా ఉండాలని కోరారు. వందేళ్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ అండగా నిలబడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement