Sunday, April 28, 2024

MBNR : ఎల్ల‌మ్మ దేవాల‌య ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మక్తల్, ఏప్రిల్23(ప్రభన్యూస్) నారాయణ పేట జిల్లా కర్ని గ్రామంలో గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇవాళ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే గ్రామ దేవత మూర్తిని గ్రామదేవతలు అంటారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలని రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో కళకళలాడేలా దీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement