Friday, May 3, 2024

CM Breakfast Scheme – విద్యార్థులతో క‌ల‌సి గ‌ద్వాల క‌లెక్ట‌ర్ బ్రేక్ ఫాస్ట్ …..

గద్వాల (ప్రతినిధి) అక్టోబర్ 6 (ప్రభ న్యూస్) పోషకాహార లోపాన్ని నివారించడానికి ఈ అల్పాహార పథకం తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో ఉన్న రెండు నియోజక వర్గాలలో గద్వాల – అల్లంపూర్ ప్రభుత్వ పాఠశాలల నందు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం వారికి చదువు పట్ల శ్రద్ధ కలిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్ మండలం వీరాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ ల తో కలిసి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాలలో చదివే పిల్లలు ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదని రాష్ట్ర ముఖ్య మంత్రి ఈ పథాకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. అల్పాహారం వల్ల పిల్లలకు చదువు పై శ్రద పెరుగుతుందని, హాజరు శాతం పెరిగేలా తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా స్కూల్ కు పంపించాలని అన్నారు. చదువు బాగా అర్థం కావాలంటే పిలలు రెగ్యులర్ గా స్కూల్ కు రావాలన్నారు. ప్రతి మూడవ శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. పిల్లల తల్లితండ్రులు పిల్లలు బాగా చదువుతున్నారా అని ఉపాద్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వయంగా జిల్లా కలెక్టర్, టిఫిన్ వడ్డించి వారితో కలిసి టిఫిన్ చేశారు. టిఫిన్ నాణ్యత, రుచిపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు పిల్లలు ఉదయమే పాఠశాలకు వచ్చి చేతులు శుభ్రం చేసుకొని అల్పాహారం స్వీకరించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, జిల్లా విద్యా శాఖ సిరాజుద్దీన్, జడ్ పి వైస్ చైర్మెన్ సరోజమ్మ, ఎం పి పి ప్రతాప్ గౌడ్, ఎం పి డి ఓ చెన్నయ్య, ఎం ఇ ఓ సురేష్,సర్పంచు స్వప్న, ప్రధానోపాధ్యా యుడు శాంతన్న , టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement