Sunday, April 28, 2024

MBNR: ఘనంగా బీరప్ప బండారు ఉత్సవాలు…

మక్తల్, ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : నారాయణపేట జిల్లా మక్తల్ ఊట్కూరు మండలాల్లో బీరప్ప బండారు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామంలో జరిగిన బీరప్ప బండారు ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని కురువ కులస్తులపై బండారు చల్లి అభినందనలు తెలియజేశారు. బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అదేవిధంగా ఊట్కూరు మండలం పెద్దపుర్ల గ్రామంలో జరిగిన బీరప్ప బండారు ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, బి కేర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి పాల్గొని బండారు చల్లి బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కురువ కులస్తులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి సహా నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో భూత్పూర్ మాజీ సర్పంచ్ కుర్వ హన్మంతు, మాజీ జడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొత్తకోట సిద్దార్థ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement