Saturday, May 4, 2024

కేసిఆర్‌ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి

మహబూబ్‌నగర్‌ : పాలమూరు ముద్దుబిడ్డ , తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలను టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు , అభిమానులు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరాడంబరంగా నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన హైద్రాబాద్‌లోని సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ లో సిఎం కేసిఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ఐటి , పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌ , విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి , ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, గువ్వల బాల్‌రాజ్‌లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి జన్మదిన కార్యక్రమంలో భాగంగా పాల మూరు టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు , నాయకులు ,అభిమానులు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాలమూరు జిల్లా కేంద్రంలోని యేనుగొండ అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు పండ్లు , స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని అంధుల పాఠశాలలో కూడా మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలకు అవసరమైన వంట సామగ్రి , మిక్సర్‌ గ్రైండర్‌ , ఫ్యాన్‌ , నిత్యవసర సరుకులను , విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసి నర్సింలు , డిసిసిబి వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తాటి గణష్‌ , కౌన్సిలర్‌లు కట్ట రవికిషన్‌ రెడ్డి , మునీర్‌ , శ్రీనివాస్‌ రెడ్డి , రోజా , తిరుమల వెంకటేష్‌ , రాము , అంజద్‌ , టిఆర్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement