Saturday, May 18, 2024

ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌లు – షెడ్యూల్ విడుద‌ల‌…

హైద‌రాబాద్ – నాగార్జున‌సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌ ఈ నెల 17వ తేదిన జ‌ర‌గ‌నుంది.. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది.. ఈ నెల 23న ఈ ఉప ఎన్నిక‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేస్తారు.. అదే రోజు నుంచి నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు.. 30వ తేది వ‌ర‌కు నామినేష‌న్స్ స్వీక‌రిస్తారు.. నామినేష‌న్స్ ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆఖ‌రు తేది ఏప్రిల్ 3. ఇక 17న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.. మే రెండో తేదిన ఓట్లు లెక్కించి ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు.. కాగా టిఆర్ ఎస్ ఎమ్మెల్యే నోముల న‌ర్శింహ‌య్య ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డంతో ఈ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement