Monday, April 29, 2024

Flash: సాగర్ లో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరిని గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. అయితే, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్టుకుపోయాడు. తమ ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో ఇరువురు సోమవారం సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సాగర్ ఎడమ కాలువలో దూకారు. వరద నీటి ప్రవాహానికి బాలకృష్ణ కొట్టుకుపోగా యువతిని స్థానికులు, పోలీసులు తాడు సాయంతో కాపాడారు. యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement