Thursday, May 16, 2024

కేటీఆర్ కి స్వాగ‌తం ప‌లికిన చిన్నారి ‘కికో’ – ఫొటో షేర్ చేసిన మంత్రి

అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగ‌తం ప‌లికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబర‌ప‌డ్డారు. ఆమె పేరు విన‌గానే మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారి పేరు కికో (KiCo – Kindness+Compassion). కికో అన‌గా క‌రుణ‌మూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె త‌ల్లిదండ్రుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె త‌ల్లిదండ్రులు మంచి ఆలోచ‌నాప‌రులంటూ చెప్ప‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌శంసించారు. చిన్నారి త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌తో ఫోటో దిగింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement