Friday, May 17, 2024

త‌ల్లికాబోతోన్న హీరోయిన్ ‘సోన‌మ్ క‌పూర్’ – వైర‌ల్ గా ఫొటో

స్టార్ హీరో అనిల్ క‌పూర్ కుమారైగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సోన‌మ్ క‌పూర్. కాగా పెళ్ల‌యిన మూడు సంవ‌త్స‌రాల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌స్తుతం సోన‌మ్ క‌పూర్ గ‌ర్భ‌వ‌తి.. కాగా భ‌ర్త ఒడిలో త‌ల‌పెట్టుకుని గ‌ర్భంపై చేయిపెట్టుకుని దిగిన బేబీ బంప్ ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. హిట్ చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అతిత‌క్కువ‌కాలంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదింకుంది. 2018లో సోనమ్‌క‌పూర్‌.. ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని వివాహం చేసుకుంది.సోన‌మ్‌క‌పూర్ తాను త‌ల్లికాబోతున్న విష‌యాన్ని ఇన్‌స్టాలో అభిమానుల‌తో పంచుకుంది. పుట్ట‌బోయే బిడ్డ‌కోసం ప్రేమ‌తో ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చింది. నిన్ను పెంచేందుకు మా నాలుగు చేతులున్నాయి. నువ్వు ఎక్క‌డ ఉన్నా ప్ర‌తిధ్వ‌నించే రెండు హృద‌యాలున్నాయి. నీపై ప్రేమాభిమానాలు కురిపించే ఒక ఫ్యామిలీ ఉంది. నీ కోసం ఎదురుచూస్తున్నాం అని పుట్ట‌బోయే బిడ్డ‌నుద్దేశించి హృద్యంగా ఫొటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement