Tuesday, April 30, 2024

పెద్దపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 209 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ తమ ప్రజాప్రతినిధులను క్యాంపుల నుండి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకురానున్నారు. పోలింగ్ కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఎసిపి, ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలు, 67 మంది సిబ్బంది బందోబస్తు లో పాల్గొన్నారు.  ప్రతి సభ్యుడు తమ వాహనాలను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో  పార్కింగ్ చేసుకోవాలని, తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రంలోకి రావాలని అధికారులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్లు, ఇంక్ పెన్నులు, అగ్గిపెట్టెలు పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement